25-02-2025 02:12:47 AM
రామగిరి, ఫిబ్రవరి 24: రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ మేడిపల్లి శివారులోని భూములను ఎంజాెు్మంట్ సర్వే కోసం వచ్చిన రెవెన్యూ అధికారులను రత్నాపూర్ గ్రామ ప్రజలు సోమవారం అడ్డుకు న్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం మేడిపల్లి శివారులోని భూములను రాష్ర్ట ప్రభుత్వం తీసుకోవడానికి నోటీసులు విడుదల చేసిన విషయం విధితమే.
దీని విష యంపై పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఇచ్చిన ఆదేశాల మేరకు ఫీల్డ్ మీదికి వచ్చిన రెవెన్యూ అధికారులను గ్రామ రైతులందరూ కలిసి అడ్డుకున్నారు. ఈ సర్వే చేసేందుకు రైతులందరూ నిరాకరించారు. ఈ భూములను ఇచ్చే ప్రసక్తే లేదని అధికారులతో తన గోడు వెళ్లబుచ్చుకున్నారు.
దీంతో అక్కడికి వచ్చిన అధికారులు తమ ఉన్నతాధికారులతో ఈ విషయంపై చర్చిం చి, అధికారుల ఆదేశాల మేరకు అక్కడి నుండి వెళ్లిపోవడం వెళ్లిపోయారు. అనంతరం రైతులందరూ కలిసి పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్దకు వెళ్లి అసిస్టెంట్ కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చి ఆర్డిఓ ను కలిసి విన్నవించారు.
ఈ కార్యక్రమంలో రైతులు కొం డు లక్ష్మణ్, మండల శంకర్, భద్రపు కృష్ణమూర్తి, భద్రపు శ్రీనివాస్, బర్ల వెంకన్న, కొవ్వూరి సురేష్, గేల్లు కృష్ణ, మండల శ్రీనివాస్, జక్కుల శివకుమార్, జక్కుల సది, తోట్ల రాయమల్లు, దాసరి నరేష్, ఎరుకలి బక్కయ్య, కొప్పుల కృష్ణకర్, మేడగొండ మహేష్, మధుకర్,బెజ్జల రాజయ్య, కండె గట్టయ్య, శ్రీనివాస్ రైతులు పాల్గొన్నారు.