18-04-2025 12:18:56 AM
* దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు
* ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
* క్వింటాలకు 500 బోనస్
* ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల్ల చిన్నారెడ్డి
గోపాలపేట ఏప్రిల్ 17: రైతులు అభివృద్ధి చెందడమే కాం గ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. గురువారం గోపాలపేట మండలం జయన్న తిరుమలాపురం గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఏఐసీ సీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లెల్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ రైతులు దళారుల మాట విని మోసపోవద్దని అన్నారు.
రై తులు రేయంబవలు కష్టపడి పండించిన ప్రతి గింజ కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు చెప్పారు.ఏకకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమా ఫీని చేసిన ఘనత ఈ ప్రభుత్వాని దేనని అన్నారు. ముఖ్యంగా అధికారులు అందుబాటులో ఉండి రైతులు తెచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. అంతేకాకుండా వారికి కావలసిన గన్ని బ్యాగులు ఏర్పాటు చేయాలన్నారు. వేసవికాలం కావడం పట్ల వారికి కావాల్సిన ఏర్పాట్లను చేసి నీడలో ఉండేలా చూడాలన్నారు.
ప్రభుత్వం రైతుల నుండి కొనుగోలు చేసే దాన్యంలో ప్రతి క్వింటాల్ వెనకాల అదనంగా 500 రూపాయల బోనస్గా ఇస్తుందని చెప్పారు. కాబట్టి ప్రతి రైతు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల జనరల్ సెక్రెటరీ జిల్లెల్ల ప్రవీణ్ రెడ్డికాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బుజ్జన్న యాదవ్ మహిళా సంఘం అధ్యక్షురాలు మన్నెమ్మ బాలేశ్వర్ రెడ్డి లోకేశ్వర్ రెడ్డి పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.