14-04-2025 01:54:23 AM
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే
మహబూబాబాద్, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి): రైతు సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, గత ప్రభుత్వంలో ధరణి ద్వారా అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చిందని, ధరణి స్థానంలో ఎలాంటి చిక్కులు లేకుండా భూ భారతి కార్యక్రమాన్ని అమలు చేస్తుందని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ అన్నారు.
జిల్లాలోని నరసింహులపేట మండలంలో పలు గ్రామాల్లో దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని చెప్పారు. దళారులను ఆశ్రయించి రైతులు మోసపోకూడదని కోరారు.