ఎమ్మెల్యే మురళీనాయక్
మహబూబాబాద్, నవంబరు 16: రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ అన్నారు. కేసముద్రం మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో వరంగల్ డిక్లేరేషన్ సభ హామీల్లో భాగంగా రైతు సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్నామన్నారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి, దనసరి, మర్రి రంగారావు, అంబటి మహేందర్‌రెడ్డి, అల్లం నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.