ఖమ్మం రూరల్ మండలం చిన్న వెంకటగిరిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం, నవంబర్ 11 ( విజయక్రాంతి) : రైతు సంక్షేమానికి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలం చిన్న వెంకటగిరిలో సోమవారం మంత్రి పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రైతు కళ్లలో ఆనం దం చూడడానికే ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ కార్యక్రమం చేపట్టి 27 రోజుల్లోనే రూ.18 వేల కోట్లు మాఫీ చేసిందన్నారు. ఇంకా మిగిలిన రైతుల రుణాలను ఈ డిసెంబర్‌లోగా మాఫీ చేస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ప్రస్తుతం మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని.. మరో నాలుగేళ్లలో 20 లక్షల ఇండ్లను అందిస్తామని మంత్రి తెలిపారు.
అమ్మ పాఠశాల కార్యక్రమం కింద రూ.657 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిసున్నామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో నర్సింహారావు పాల్గొన్నారు.