23-04-2025 01:19:16 AM
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.
చిట్యాల,ఏప్రిల్ 22(విజయ క్రాంతి): రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని, అందులో భాగంగానే సన్న వడ్లకు 500 బోనస్ కల్పిస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.
మంగళవారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్, నవాబుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన వరి దాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని రైతులకు సూచించారు. దళారుల మాటలు నమ్మవద్దని,అనేక కొర్రీలు పెట్టి రైతుకు నష్టం చేకూరుస్తారన్నారు. ప్రభుత్వం గ్రేడ్ ఏ రకానికి రూ.2320, సాధారణ రకానికి రూ 2300 చెల్లిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి సత్యనారాయణ, మార్కెట్ సెక్రటరీ కనక శేఖర్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి ముఖిరాల మధువంశీ కృష్ణ,మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి,అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య, టౌన్ అధ్యక్షుడు బుర్ర లక్ష్మణ్ గౌడ్, యూత్ మండలాధ్యక్షుడు అల్లకొండ కుమార్,మాజీ ఎంపీటీసీ దబ్బేట అనిల్,నవాబుపేట మాజీ సర్పంచ్ కసిరెడ్డి సాయి సుధా రత్నాకర్ రెడ్డి, చిలుకల రాయకొమురు,బుర్ర శ్రీనివాస్, గంగాధరి రవీందర్, తదితరులు పాల్గొన్నారు.