14-04-2025 12:49:24 AM
* వరదలతో దెబ్బతిన్న కాలువల మరమ్మత్తులు
* వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు
ఖమ్మం, ఏప్రిల్ 13( విజయక్రాంతి ):-రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ సర్కారు పనిచేస్తుందని, రైతు అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నాగార్జున సాగర్ కెనాల్ ఆధునికరణ, మరమ్మత్తులు, తదితర అంశాలపై సూర్యాపేట,ఖమ్మం ఎన్‌ఎస్ పి సిఇ రమేష్ బాబు తో మంత్రి తుమ్మల ఆదివారం మాట్లాడారు.
గత ఆగస్టు నెలలో వచ్చిన అకాల వర్షాలు వరదలకు కాలవలు పూర్తిగా దెబ్బతిన్నాయని, మే నెల ఆఖరి వరకు కాలువల ఆధునికరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. చివరి ఆయకట్టు భూములకు సైతం నీరందించేలా పటిష్ట ప్రణాళికలతో నాణ్య త ప్రమాణాలు పాటించేలా మరమ్మత్తులు ఆధునికరణ చేయాలని సూచించారు.
భాగంగా ఆయా కాలువల మరమ్మత్తులు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రధాన వనరుగా ఉన్న ఎన్‌ఎస్పి కాలువల ద్వారా చివరి భూములకు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. నాణ్యత పనుల్లో ఎక్కడ రాజీ పడకుండా పనిచేయాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు.