calender_icon.png 31 March, 2025 | 7:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం

21-03-2025 12:00:00 AM

మామిడి పండ్ల మార్కెట్ ప్రారంభోత్సవంలో మంత్రి కొండా సురేఖ, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

హనుమకొండ, మార్చి 20 (విజయక్రాంతి): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొ రేషన్ 14వ డివిజన్ పరిధిలోని ముసలమ్మకుంట గ్రామ శివారు లో నూతన మామిడి పండ్ల మార్కెట్ ను  రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ, వర్ధన్నపేట ఎమ్మెల్యే  కేఆర్ నాగరాజు గురువారం ప్రారంభించారు.మంత్రి సురేఖ, ఎమ్మెల్యే నాగరాజు లను అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.

తదనంతరం రైతుల దగ్గరి నుంచి తీసుకొని వచ్చిన మామిడి పండ్లను వ్యాపారస్తుల కొనుగోలును ప్రారంభించారు.మామిడి పండ్లను ఎక్కువ ఉత్పత్తి చేస్తున్న పెద్ద రైతు నిమ్మానీ శేఖర్ రావుని శాలువాతో మంత్రి సురేఖ, ఎమ్మెల్యే నాగరాజు సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.

దళారులు లేకుండా నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేస్తారని చెప్పారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ పండ్ల మార్కెట్ వచ్చేవారి కోసం నా సీడీఎఫ్ నిధుల నుంచి మర్గుదొఢ్లకు 10 లక్షల మంజూరు చేస్తానన్నారు .పండ్ల మార్కెట్ అభివృద్ధి కోసం డిపిఆర్ తయారు చేయించి మంత్రుల సహకారంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారద దేవి, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డివో చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ బొమ్మేని రవీందర్ రెడ్డి, పండ్ల మార్కెట్ అధ్యక్షుడు వెల్ది సాంబయ్య  స్థానిక కార్పొరేటర్ తూ ర్పాటి సులోచన - సారయ్య, డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్  వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.