మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో షురూ
మహబూబ్‌నగర్, నవంబర్ 27 (విజయక్రాంతి): రైతు పండుగకు సర్వం సిద్ధం అయింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని భూత్పూర్ మండల కేంద్రంలోని అమిస్తాపూర్ వద్ద వేడుకలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు వేడుకలు నిర్వహించనున్నారు.
బుధవారం ఏర్పాట్లను కలెక్టర్ విజయేందిర బోయి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు పండుగలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో పలు అంశాలపై ప్రదర్శన, శిక్షణ, అవగాహన కార్యక్రమాల ను ఉంటాయన్నారు.
వ్యవసాయ అనుబం ధ శాఖలకు సంబంధించి 155 ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 30వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు. ఈ వేడుకలను తిలకిచేం దుకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు హాజరుఅవ్వనున్నట్లు పేర్కొన్నారు.