calender_icon.png 20 January, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి మాస్టర్‌ప్లాన్ రద్దు జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి

19-01-2025 11:34:05 PM

ప్రభుత్వ సలహాదారుతో పాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తెవాలి

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దుపై 8 గ్రామాల రైతు ప్రతినిధుల సమావేశంలో తీర్మానం

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను వెంటనే రద్దు చేయాలని రైతు ఐక్యకార్యాచరణ కమిటి ప్రతినిధులు డిమాండ్ చేశారు. గత ఏడాది క్రితం రైతులు మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేయగా అప్పటి మున్సిపల్ శాఖమంత్రి కేటిఆర్ కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికే ఎన్నికలు రావడంతో మాస్టర్ ప్లాన్ రద్దు విషయం మరుగున పడిపోయింది.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన మాస్టర్‌ప్లాన్ రద్దుపై ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్‌ఎల్లారెడ్డి చెందిన యువరైతు శ్రీకాంత్‌రెడ్డి సంక్రాంతి ముందు రోజు నుండి కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట అమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం విధితమే. రైతు ఐక్యకార్యాచరణ కమిటి ప్రతినిధులు ఎవరైతే శ్రీకాంత్‌రెడ్డి అమరణ నిరాహార దీక్షను విరమించాలని కొరి రైతులు ఆదివారం ఉద్యమ కార్యాచరణపై సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఆదివారం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలో రైతు ఐక్యకార్యచరణ కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఎల్లారెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యేలు మధన్‌ మోహన్‌ రావు, కాటిపల్లి వెంకటరమణారెడ్డిల దృష్టికి తీసుకెళ్లి చర్చించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే విధంగా ఒత్తిడి చేయాలని సమావేశంలో తిర్మానించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ఆలీ దృష్టికి చర్చించాలని సమావేశంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటి ప్రతినిధులు చర్చించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి చేసేలా కార్యాచరణ రూపొందించారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేసి కామారెడ్డి మాస్టర్ ప్లాన్  రద్దు జరిగే వరకు ఉద్యమించాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటి ప్రతినిధులు సమావేశంలో తీర్మానించారు. 8 గ్రామాల రైతులకు చెందిన పంట భూముల్లో ఇండస్ట్రీయల్,గ్రీన్ జోన్లు ఎత్తివేయాలని మరోవైపు ప్రభుత్వ భూములు ఉన్న ప్రాంతాల్లో ఇండస్ట్రీయల్ జోన్, గ్రీన్‌జోన్లుగా ప్రకటించాలని ప్రబుత్వం కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై పునరలోచన చేసి మాస్టర్ ప్లాన్ రద్దు జీవోను విడుదల చేయాలని సమావేశంలో రైతులు చర్చించారు. ప్రజాప్రతినిధులు ప్రభుత్వం స్పందించకుంటే మాస్టర్ ప్లాన్ రద్దు లొల్లి రగడ మళ్లీ షురూ చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటి ప్రతినిధులు సమావేశంలో తీర్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి.