హుటాహటిన ఆసుపత్రికి తరలింపు...
వనపర్తి (విజయక్రాంతి): వనపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణ వద్ద రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం… వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం ఏదుట్ల గ్రామానికి చెందిన రైతు సాయిరెడ్డి 4 ఎకరాల భూమిని… అన్నదమ్ములు సాగు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ గతంలో పలుమార్లు ప్రజావాణిలో విన్నవించుకున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని మనస్థాపానికి గురైన రైతు సాయిరెడ్డి వనపర్తి కలెక్టరేట్ ఆవరణ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
అతనికున్న 4 ఎకరాల భూమిని అన్నదమ్ముళ్లు సాగు చేయకుండా అడ్డుకోవడంతో, దాడి చేశారు అని పలుమార్లు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రత్నించాడు. సోమవారం రోజు ప్రజావాణి జరుగుతున్న హాల్ లోనికి వెళ్ళాడు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పిర్యాదులు తీసుకుంటున్న సమయంలో పురుగుల మందు తాగరు, కార్యక్రమంలో ఉన్న అదనపు కలెక్టర్ పోలీసులకు చెప్పడంతో ఆ రైతును అక్కడే ఉన్న డిప్యూటీ డియం & ఏచ్చేఒ ప్రభుత్వ వాహనంలో చికిత్స నిమిత్తం వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రైతు సాయిరెడ్డికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.