కామారెడ్డి (విజయక్రాంతి): నెలలు గడుస్తున్న సన్న రకం వడ్లు కొనుగోలు చేయడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు చేపట్టకపోతే పురుగుల మందు తాగి చస్తామని రైతుల డిమాండ్ చేస్తున్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి అజామాబాద్ సొసైటీ పరిధిలో సన్న రకం వడ్లను కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. నెలలు గడుస్తున్నా అధికారులు మాత్రం ఏమి పట్టనట్లు వ్యవహరించడం, సొసైటీ అధికారి దురాహంకార మాటలతో రైతులు విసుగు చెంది, సొసైటీని ముట్టడించారు. దీంతో కాస్త హైడ్రామా కొనసాగినట్లు తెలుస్తుంది. అధికారులు ఎంత చెప్పినా వినకపోవడంతో మనస్థాపానికి చెందిన రైతులు మందు తాగి చస్తామని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి సన్నారకం వడ్లను కొనుగోలు చేయాలని రైతులు జిల్లా కలెక్టర్ కు వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు సంతోష్ రెడ్డి, సాయిబాబా, రాజిరెడ్డి, పీకే నరేష్, సురేందర్ మిగతా రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.