calender_icon.png 27 November, 2024 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు డ్రోన్లను వినియోగించుకోవాలి

27-11-2024 01:44:23 AM

వ్యవసాయ శాఖ సంచాలకులు గోపీ  

హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): కూలీల కొరత ప్రధాన సమస్యగా మారిన తరుణంలో దాని ని అధిగమించేందుకు  డ్రోన్లను వినయోగించుకోవాలని రైతులకు  వ్యవ సాయ సంచాలకులు గోపీ సూచించారు. మంగళవారం రైతు నేస్తం కార్యక్రమంలో వ్యవసాయంలో డ్రోన్ల వాడకం, జీరో టిల్లేజీ విధానంలె మొక్కజొన్న సాగుపై అవగాహన కల్పించారు.

డ్రోన్లు ద్వారా ఒక ఎకరంలో  విత్తనాలు నాటేందుకు 5-6 కేజీల విత్తనం సరిపోతుందన్నారు. పురుగు మందుల పిచికారీలో  ఖర్చు కూడా తగ్గుతుందని తెలిపారు. జీరో టిల్లేజీ విధానంలో మొక్కజొన్నసాగుతో రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతున్నాయన్నారు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చింతకాని మండలంలో బసవపురం, రాఘవాపుర, రామకృష్ణాపురంలో 100 హెక్టార్లలో ఈ పద్ధతిలో  మొక్కజొన్న సాగును  ప్రయోగాత్మకంగా  ప్రోత్సహించనున్నట్లు చెప్పారు. ఈ విధానంలో  మొక్కజొన్న సాగు  చేస్తున్న చింతకాని మండలం నుండి అభ్యుదయ రైతు నరసింహ రావు తన అనుభవాలను పంచుకొన్నారు. కార్యక్రమంలో 566 రైతు వేదికల నుంచి జిల్లా వ్యవసాయ అధికారులతో పాటు వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.