calender_icon.png 12 April, 2025 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలి

05-04-2025 01:24:31 AM

రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

చేవెళ్ల, ఏప్రిల్ 4 : రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపునిచ్చారు. శుక్రవారం శంకర్పల్లిలోని బద్దం సురేందర్రెడ్డి గార్డెన్లో ఏకల వ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రకృతి, సేంద్రియ రైతు సమ్మేళనానికి ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమి మనకు దేవుడిచ్చిన వరమని, మన పూర్వీకులు భూమిని పరిరక్షిస్తూ, ప్రకృతికి అను గుణంగా పంటలు సాగు చేసేవారని గుర్తుచేశారు. రసాయన ఎరువుల వాడకంతో మట్టిలో సూక్ష్మజీవుల సంఖ్య తగ్గి... భూ సారం, పంటల దిగుబడిపై ప్రభావం చూపుతోందన్నారు.

ఇది భవిష్యత్ తరాలకు ప్ర మాదకంగా మారుతోందని, రసాయనాలతో పండించిన పంటలు తింటే పుట్టబోయే పిల్లలకు కూడా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. ప్రకృతి వ్యవసాయ విధానా ల్లో రసాయనాలకు చోటుండదని, తక్కువ పెట్టుబడిలో అధిక లాభం పొందవచ్చన్నారు. ఇందుకోసం సేంద్రియ ఎరువులను స్వయంగా తయారు చేసుకోవాలని సూచించారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతులకు ఆర్థిక సాయం, అవగాహన కార్యక్రమాలతో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహి స్తున్నాయని చెప్పారు. అనంతరం రైతులు ఏర్పాటు చేసిన సేంద్రియ సాగుకు సంబంధించిన వివిధ స్టాల్స్ను తిలకించి వారికి జ్ఞాపికలను అందజేశారు.