12-04-2025 01:05:23 AM
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మం, ఏప్రిల్ 11 ( విజయక్రాంతి ):-రైతన్నలు తమ ఆరోగ్యంపై శ్రద్ద వహించాలని, చెడు అలవాట్లను మెల్ల, మెల్లగా మాని వేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెంలో ఆంధ్రా బ్యాంక్ కర్షక సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై క్షేత్ర స్థాయిలో రైతులతో ఇంటారాక్ట్ అవుతున్న సమయంలో మనకు పూర్వపు జనరేషన్ తాతలు, బామ్మలు మన కంటే మంచి ఆరోగ్యంతో ఉండటం గమనించామని అన్నారు. నేడు వైద్య శిబిరం ద్వారా పరీక్షలు నిర్వహించుకుని అవసరమైన జాగ్రత్తలు పాటించాలని అన్నారు.
రెవెన్యూ, వ్యవసాయ శాఖ రైతుల కోసం మాత్రమే ఉందని, రైతుల కష్టాలను తొలగింపుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు నమ్మకం కోల్పోవద్దని, మా స్థాయిలో ఉన్న సమస్యలను సంపూర్ణంగా పరిష్కరిస్తామని అన్నారు.
రైతులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎబిఎఫ్‌ఎస్‌ఎస్‌ఎస్ చైర్మన్ బీరెడ్డి నాగ చంద్రారెడ్డి, జిల్లా సహకార అధికారి గంగాధర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కళావతి బాయి, ఖమ్మం రూరల్ ఎంపిడివో కుమార్, తహసీల్దార్ రాంప్రసాద్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.