28-03-2025 12:36:08 PM
కామారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మ గోని లక్ష్మీ రాజా గౌడ్
కామారెడ్డి,(విజయక్రాంతి): రైతులు ఉచిత పశు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్(Chairman of Kamareddy Market Committee) ధర్మగోని లక్ష్మీ రాజా గౌడ్ కోరారు. శుక్రవారం కామారెడ్డి మండలం ఇస్రోజివాడి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) రైతులకు సంబంధించిన పశువులు ఆరోగ్యకరంగా ఉండేందుకు ఉచిత పశు వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని కామారెడ్డి మండల పరిధిలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రతి గ్రామంలో పశువైద్య శిబిరాన్ని ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పశువైద్యాధికారులు గోపాలమిత్ర ప్రతినిధులు పాల్గొని రైతులకు అవగాహన కల్పించడమే కాకుండా పశువులకు అవసరమైన మందులను చికిత్సలను ఉచితంగా అందిస్తున్నారని తెలిపారు. ఈ పశు వైద్య శిబిరంలో పశు వైద్యులు రవికిరణ్ , అనిల్ రెడ్డి గోపాలమిత్రలు కలిసి చికిత్స లు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మగొని లక్ష్మీరాజాగౌడ్ , వైస్ చైర్మన్ మినుకూరి బ్రహ్మానందరెడ్డి, డైరెక్టర్లు సుదర్శన్ రావు, వలిప్శెట్టి లక్ష్మీరాజమ్, దోమకొండ శ్రీనివాస్, మక్బుల్, రాజలింగం, గ్రేడ్ 3 సెక్రటరీ దర్శింగ్ , మార్కెట్ కమిటీ సిబ్బంది, పశువైద్యాధికారులు, రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.