07-04-2025 06:58:02 PM
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పురపాలక సంఘ పరిధిలోని 5వ వార్డ్ గండి మాసన్ పేట్ లో సోమవారం నాడు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్ముకొని మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. ప్రైవేటు వ్యక్తులకు ధాన్యం అమ్ముతే దళారులు రైతులను మోసం చేసే అవకాశం ఉంటుందని, ఎటువంటి మోసాలకు గురి కాకుండా వరి ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోని విక్రయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్ డి ఓ ప్రభాకర్, సీఈఓ విశ్వనాథం, సొసైటీ చైర్మన్ నర్సింలు, వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, రాజు, వెంకటరామిరెడ్డి, తిరుపతి, దేవదాస్ స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.