calender_icon.png 18 April, 2025 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

10-04-2025 11:07:35 PM

మోతే: రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని రాఘవపురం, సిరికొండ, భళ్ళు తండా రాయిపహాడ్, బుర్కచర్ల, ఉర్లుగొండ, తుమ్మ గూడెం నరసింహపురం రాంపురం తండ గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించి మద్దతు ధర పొందాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శ్రీకాంత్, ఏవో అరుణ, ఏపిఎం వెంకటయ్య, సిసి రామకృష్ణ, పిఎ సి ఎస్ చైర్మన్ కొండపల్లి వెంకటరెడ్డి, సొసైటీ చైర్మన్ ముప్పాని శ్రీధర్ రెడ్డి, ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి, మాజీ సర్పంచ్ మామిడి వెంకటేశ్వర్లు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పులి ఈదయ, గ్రామ శాఖ అధ్యక్షులు కృష్ణారెడ్డి, కర్ణాకర్ రెడ్డి, అశోక్ రెడ్డి, లక్ముడు, కండక్టర్ వెంకన్న, కోర్ర రాములు నాయక్, కటికం శ్రీనివాస్ గౌడ్, లచ్చు,శోభన్ తదితరులు పాల్గొన్నారు.