calender_icon.png 22 April, 2025 | 11:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

13-04-2025 08:51:11 PM

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ చైర్మన్ కొట్నాక తిరుపతి

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ చైర్మన్ కొట్టాక తిరుపతి అన్నారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ చైర్మన్ కోట్నాక తిరుపతి మాట్లాడుతూ... రైతులకు ఎలాంటి కష్టం నష్టం వాటిల్లకుండా రాష్ట్ర  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆశయమన్నారు. రైతు భరోసాతో రైతులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి వారి భవిష్యత్తును బంగారంగా మార్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేదరి సుమలత, మాజీ సర్పంచ్  కౌన్సిలర్ రాందేని వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడు చిన్న వెంకటేష్, నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.