calender_icon.png 20 April, 2025 | 9:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

20-04-2025 05:45:42 PM

ఎమ్మెల్యే కోరం కనకయ్య..

టేకులపల్లి (విజయక్రాంతి): రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించుకుంటే ఉపయోగకరమని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah), జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్(District Collector Jitesh V Patil) అన్నారు. టేకులపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. ప్రభుత్వం ధాన్యానికి మద్దతు ధరతో పాటు, క్క్విన్టాలుకు రూ. 500 బోనస్ ఇస్తుందని తెలిపారు. దళారులను నమ్మితే రైతులు మోసపోతారని సూచించారు. ఎక్కువ దిగుబడులు సాధించేందుకు కృషి చేయాలన్నారు. వరితో పాటు ఇతర రోగులపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో బేతంపూడి సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్ రావు, ఏ డి ఏ, ఏఓ అన్నపూర్ణ, సొసైటీ కార్యదర్శి పొన్నోజు ప్రేమాచారి, సొసైటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.