calender_icon.png 19 April, 2025 | 5:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

16-04-2025 12:17:19 AM

 ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి....

తలకొండపల్లి,ఎప్రిల్ 15: రైతుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. మంగళవారం  తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో ఏర్పాటు చేసిన సన్ ఫ్లవర్,మక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే నారాయణరెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు,నాయకులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను మద్య దళారులకు అమ్ముకుని నష్ట పొవద్దని ఆయన హితవు పలికారు. రైతులు తమ పంటలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు అమ్ముకుని లబ్ది పొందాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ ఛైర్మన్ గట్ల కేశవరెడ్డి,ఆమనగల్ మార్కెట్ కమిటి ఛైర్పర్సన్ యాట గీతనర్సింహ,మార్కెట్ కమిటి డైరెక్టర్ అజీం,మాజీ ఎంపిటిసి దాసరి యాదయ్య,మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి,  కాంగ్రేస్ పార్టీ నాయకులు శతాబ్ది టౌన్ షిప్ ఎండి కాసు శ్రీనివాస్ రెడ్డి, ఎమిరెడ్డి రంగారెడ్డి,జక్కు శ్రీనివాస్ రెడ్డి,జగ్గారెడ్డి,రాజునాయక్,దశరథం,రవీందర్ యాదవ్, బాల్ రెడ్డి,వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.