calender_icon.png 19 April, 2025 | 3:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

09-04-2025 04:45:06 PM

పిఎసిఎస్ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర్లు..

అనంతగిరి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పిఎసిఎస్ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర్లు అన్నారు. అనంతగిరి మండల పరిధిలోని వాయిలసింగవరం గ్రామంలో పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సంధర్భంగా ఆయన మాట్లాడుతూ... సన్నరకాలైన హెచ్ఎంటివడ్లను ఎండబెట్టి తూరుపాల పోసి నాణ్యమైన మద్దతు ధర 1 క్వింటాకు 2320 రూపాయలను పొందాలని అన్నారు. అలాగే ప్రభుత్వం నుండి 1 క్వింటాకు రూ 500 రూపాయలు బోనస్ పొందాలని సూచించారు. అలాగే మధ్య దళారులను ఆశ్రయించవద్దని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలని సూచించారు.

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ఆయన అన్నారు. అలాగే కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటలలో డబ్బులు పడేవిధంగా చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఈవో కొల్లు ప్రభాకర్ రావు మాజీ యంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు వ్యవసాయ విస్తరణ అధికారి అన్వేష్ సెంటర్ ఇన్చార్జి మోతుకూరి రాజారావు డైరెక్టర్లు వీరబోయిన వెంకటేశ్వర్లు నేరెళ్ళ సైదులు రైతులు కొల్లు సుబ్బారావు చుండూరు మురళి బుర్రా నాగమల్లేశ్వరరావు బుర్రా పెద్ద గొల్ల వెంకన్న మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గద్దె రామారావు మండల బిసి సెల్ కార్యదర్శి వీరబోయిన నాగరాజు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కంటు వేణుమల్లెబోయిన గంగరాజు నాగశేషు నాగేశ్వరరావు ముత్తేష్ తదితరులు పాల్గొన్నారు.