calender_icon.png 15 November, 2024 | 10:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

13-11-2024 05:16:04 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. బుధవారం దహేగాం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాతో కలిసి సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం నాణ్యమైన వరి ధాన్యం కొనుగోలు చేసి సంబంధిత రైతుల ఖాతాలలో నగదు చెల్లింపులు చేయడం జరుగుతుందని తెలిపారు. రైతుల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కనీస మద్దతు ధర అందించి రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.

కొనుగోలు కేంద్రాలలో రైతుల సౌకర్యార్థం త్రాగునీరు, నీడ, గన్ని సంచులు, టార్పాలిలను అందుబాటులో ఉంచడం జరిగిందని, తేమ, తూకం యంత్రాలు, ఇతర అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం నాణ్యత, సామాగ్రి, పారిశుధ్య పనులను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మధ్యాహ్నం భోజనంలో మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని సకాలంలో అందించాలని తెలిపారు. ఆహారం తయారీలో తాజా కూరగాయలు, నాణ్యమైన సరుకులను వినియోగించాలని, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, పంచాయతీ కార్యదర్శి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.