calender_icon.png 27 December, 2024 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.. ఎమ్మెల్యే గడ్డం

07-11-2024 04:10:35 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతుల సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ కోరారు. గురువారం తాండూరు మండలంలోని రేపల్లెవాడలో శ్రీరామ జిన్నింగ్ మిల్లును ఆయన ప్రారంభించారు. యువ పత్తి రైతులు ప్రసాద్, రాములను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రానికి తక్కువ తేమతో ఉండే నాణ్యమైన పత్తిని తీసుకువచ్చి మద్దతు ధరలు పొందాలని కోరారు. పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకున్నారని చెప్పారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. పత్తి, వరి ధాన్యం విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైన నేరుగా తనను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్ షాబుద్దీన్, జిన్నింగ్ మిల్లు యాజమాన్యం, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.