calender_icon.png 25 February, 2025 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాభిప్రాయ సేకరణకు రైతులు మద్దతుగా నిలవాలి

25-02-2025 02:19:05 PM

శాంతిఖని లాంగ్వాల్ ప్రాజెక్ట్ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు రైతులు మద్దతు గా నిలవాలి... మందమర్రి ఏరియా జిఎం దేవేందర్ 

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మార్చి 3వ తేదీన నిర్వహించనున్న శాంతిఖని గని లాంగ్వాల్ ప్రాజెక్ట్(Shanthikhani Mine Longwall Project) పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ(Referendum)కు సమీప గ్రామాల ప్రజలు, రైతులు మద్దతుగా నిలవాలని మందమర్రి ఏరియా జీఎం జి. దేవేందర్(Mandamarri Area GM G. Devender) కోరారు. మంగళవారం బెల్లంపల్లి లోని పాత జిఎం కార్యాలయంలో గల శాంతిఖని గని ఏజెంట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1954వ సంవత్సరంలో ప్రారంభించబడ్డ శాంతిఖని గని 2006వ సంవత్సరంలో పర్యావరణ అనుమతులు పొంది 681.23 హెక్టార్ల విస్తీర్ణంలో 1.167 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో కొనసాగుతున్నట్లు చెప్పారు.

ఈ భూగర్భ గని కార్యకలాపాల నిర్వహణ కోసం ఎక్కడ అదనపు భూమి అవసరం లేదని తెలిపారు. 2018 ఏప్రిల్ 6 న కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ప్రకటించిన నియమావళి ప్రకారం పర్యావరణ అనుమతులు తీసుకునేందుకు ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిజామాబాద్, మంచిర్యాల జిల్లా కలెక్టర్ అనుమతులు పొందినట్లు జిఎం దేవేందర్ చెప్పారు. భవిష్యత్తులో లాంగ్ వాల్ ప్రాజెక్టు కొనసాగాలంటే గని సామర్థ్యం 14. 34 హెక్టార్లు విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. శాంతిఖని గని లాంగ్వాల్ ప్రాజెక్టు ఒక భూగర్భ గని మాత్రమే అని చెప్పారు.

దీని ద్వారా 9 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీసి అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. బెల్లంపల్లి పట్టణానికి ఉజ్వల భవిష్యత్తు ఉండాలంటే శాంతిఖని గని లాంగ్ వాల్ ప్రాజెక్టు ను విస్తరింపజేయాలని సూచించారు. అండర్ గ్రౌండ్ విధానంలోనే లాంగ్వేజ్ టెక్నాలజీ ఉపయోగించి శాంతిఖని గని జీవిత కాలాన్ని పెంచుకునే అవకాశం ఉందన్నారు. కొద్ది రోజులుగా శాంతిఖని లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ఓపెన్ కాస్ట్ గనిగా మారబోతుందన్న ప్రచారం జరిగిందని, ఇది వాస్తవం కాదని చెప్పారు. బెల్లంపల్లిలో ఎక్కడ ఓపెన్ కాస్టు చేపట్టి ఆలోచన సింగరేణికి లేదన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ గనులు వచ్చే అవకాశం ఎంత మాత్రం లేదని స్పష్టం చేశారు.

రాబోయే రోజుల్లో సింగరేణి చాలా సవాళ్లను ఎదుర్కోబోతుందని స్పష్టం చేశారు. శాంతిఖని గని భవిష్యత్తుకు లాంగ్ వాల్ ప్రాజెక్ట్ విస్తరీకరణ ఒక తొలిమెట్టని తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. రూ 3 వేల కోట్లతో లాంగ్ వాల్ ప్రాజెక్ట్ నిర్వహణకు సంబంధించిన అన్ని రకాల పరికరాలను సంసిద్ధం చేసుకునే దిశలో సంస్థ ముందుకు సాగుతున్నట్లు జిఎం దేవేందర్ వెల్లడించారు. ఈ సమావేశంలో మందమర్రి ఏరియా ఎస్ ఓ టు జి ఎం ఎం. విజయ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యాంసుందర్, శాంతిఖని గని ఏజెంట్ ఖాదిర్, ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.