11-04-2025 12:00:00 AM
అడిషనల్ కలెక్టర్ మోతీలాల్
బెల్లంపల్లి, ఏప్రిల్ 10 (విజయక్రాంతి) : రైతులు తాము పండించే వరి ధాన్యాన్ని ప్రభుత్వం ప్రారంభించ బోయే వరి కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ సభావత్ మోతిలాల్ సూచించారు. గురువారం బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల రైతువేదికలో బెల్లంపల్లి నియోజక వర్గ స్థాయి రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష స మావేశానికి అడిషనల్ కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో నే అందుకోవాలని దళాలకు అమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు. బెల్లంపల్లిలో డివిజన్ సంబంధించిన రైతుల వరి ధాన్యాన్ని కొత్తగా ప్రారంభించబోయే వరి కొనుగోలు కేంద్రాల్లో విక్రయిం చేందుకు చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేఅంటున్నట్లు అడిషనల్ కలెక్టర్ సబావత్ మోతీలాల్ పేర్కొన్నారు.
ఆయన వెంట బెల్లంపల్లి ఆర్డీవో బి హరికృష్ణ, మండల వ్యవసాయ అధికారి సుద్దాల ప్రేమ్ కుమార్ డిఆర్‌డిఓ కిషన్ బెల్లంపల్లి డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు రాజ నరేం దర్ ఎంపీడీవో మహేందర్ డిసిఓ తదితరులు పాల్గొన్నారు