22-04-2025 01:01:29 AM
గోపాలపేట ఏప్రిల్ 21: ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందు లు కారకుండా వారు సేద తీరేందుకు నీడ నీరును ఏర్పాటు చేయాలని వనపర్తి ఎమ్మెల్యే మేగారెడ్డి అన్నారు. గోపాలపేట మండల కేంద్రంలో సోమవారం ఐకెపి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మేగా రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. రైతులకు ప్రభుత్వం సరైన న్యాయం చేస్తుందని అన్నారు. అంతేకాకుండా వరి ధాన్య కొనుగోలు చేసిన క్వింటాలుకి 500 రూపాయలను అదనంగా ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. రైతులు రాత్రింబవళ్లు కష్టపడి పండించిన పంటను దళారుల చేతిలో పెట్టకూడదని తెలిపారు.
ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుంది కాబట్టి రైతులు తప్పక ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే వరి ధాన్యాన్ని విక్రయించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో తాసిల్దార్ తిలక్ రెడ్డి డిపిఎం భాష ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ రెడ్డి సత్య శీలా రెడ్డి కొంకి వెంకటేష్ రాజు శివన్న గోపాల్ మహిళా సంఘ సభ్యులు రైతులు పాల్గొన్నారు.