calender_icon.png 12 March, 2025 | 5:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు ఆందోళన చెందొద్దు

12-03-2025 12:00:00 AM

  • పసుపు రైతుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది 

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ర్ట సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి

నిజామాబాద్ మార్చి 11 (విజయ క్రాంతి) : రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు, ఉపాధ్యాయులకు సిఎం గారు అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఈ ఎన్నికల్లో  ఓడిపోవడం నిరాశకు గురి చేసింది అని, అంతేకాకుండా దశాబ్దాల పాటు ఈ రాష్ట్రాన్ని పాలించిన వారు ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని,మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 56 వేల  ఉద్యోగాలు ఇచ్చిన పట్టబద్రులు ఎందుకు ఓటు వేయలేరో అనేది అర్థం కావడం లేదు లేదు అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మనాల మోహన రెడ్డి అన్నారు.

మంగళ వారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  రాష్ర్ట సహకార యూనియన్ లిమిటెడ్ చెర్మన్  జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్‌రెడ్డి, నుడా చెర్మన్ కేశ వేణు విలేకరుల సమావేశం నిర్వహించారు.గత కొన్ని రోజులుగా జిల్లాలో పసుపు ధర గురించి రైతులు ఆందోళన చెందుతున్నరని, పసుపు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రైతులకు ధైర్యం చెప్పారుపసుపు కొనుగోళ్లకు ప్రత్యేక అదికారిని నియమించాలని జిల్లా కలెక్టర్ ను కోరడం జరిగిందని,

ప్రత్యేక అదికారిని నియమించి రైతులకు న్యాయం చేస్తామని ,రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.ఎంపి అరవింద్ పసుపు బోర్డ్ ను తెచ్చనని గొప్పలు చెప్పుకుంటున్నాడని,  నిజామాబాదు లో పసుపు పండిస్తే ,బోర్డ్ ను ఢిల్లీలో పెట్టడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే పసుపు బోర్డ్ ను నిజామాబాద్ లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

జిల్లాకు చెందిన వారే పసుపు బోర్డ్ చెర్మన్ గా వున్న పసుపు రైతులను మోసం చేస్తున్నారని, పసుపు రైతులకు అన్యాయం జరుగుతుంటేఅరవింద్ ఎక్కడ మొహం పెట్టుకుంటాడో చెప్పవలసిన అవసరం వుంది అని మానాల మోహన్ రెడ్డి అన్నారు. రైతు ఎండిన పసుపును మార్కెట్ యార్డుకు తీసుకుని రావాలని, అదేవిధంగా మద్దతు ధర వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

గత సంవత్సరం పసుపు ధర పెరిగితే అది కేంద్ర ప్రభుత్వం పసుపు ఎగుమతులు చేయడం ద్వారానే పెరిగింది అని చెప్పిన అరవింద్ ఇప్పుడు పసుపు ధర తగ్గిన క్రమంలో ఎందుకు మాట్లాడటం లేదు అని మానాల మోహన్ రెడ్డి ప్రశ్నించారు. పసుపు ధర ఎందుకు తగ్గిందో చెప్పాల్సిన బాధ్యత జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పైన స్థానిక ఎంపీ అరవింద్ పైన ఉంది అని మానాల మోహన్ రెడ్డి గుర్తు చేశారు.

పసుపు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని రాష్ర్ట ప్రభుత్వం పసుపు రైతుల సమస్యలు తీర్చే విధంగా ప్రాణాలిక రూపొందిస్తుంది అని కేంద్ర ప్రభుత్వంపై పసుపు రైతుల సమస్యల గురించి ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటామని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, మాజీ రాష్ర్ట యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గోపి,రాష్ర్ట ఎన్ ఎస్ యు ఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్,బింగి శుభం,సాయి కిరణ్,కౌశిక్ మరియు తదితరులు పాల్గొన్నారు.