calender_icon.png 18 October, 2024 | 3:31 AM

రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలి

18-10-2024 12:51:15 AM

మంత్రి దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి, అక్టోబర్ 17 (విజయక్రాంతి): రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో వాన కాలం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాలో 211 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. యాసంగిలో రైతులు పంట మార్పిడి చేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని అన్నారు. రైతు రుణమాఫీ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్, పౌరసరఫరా లశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ కొండల్‌రావు, ఎల్‌డీఎం గోపాల్‌రెడ్డి, పీడీ జ్యోతి, సహకార శాఖ, మార్కెటింగ్, తూనికల కొలతల శాఖ అధికారులు పాల్గొన్నారు.