కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతులకు అవసరమైన సహకారం అందిస్తూ ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ సూచించారు. జిల్లాలోని కథలాపూర్ మండలం భూషణ్రావుపేటతో పాటూ రాయికల్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ను కలెక్టర్ బి.సత్య ప్రసాద్ శనివారం ఆకస్మి కంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలె క్టర్ మాట్లాడుతూ సహకార సంఘాలు ఎప్ప టికప్పుడు రైతులకు అవసరమైన సహకారం అందించాలన్నారు. పంటల విషయంలో ఎరువుల పంపిణీ విషయంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో తగు జాగ్రత్తలు తీసు కోవాలని సంబంధిత సిబ్బందికి కలెక్టర్ సూ చించారు. ఈ సందర్భంగా పలు రికార్డు లను, లైసెన్స్ బిల్ బుక్కులు, రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు.
గత సంవత్సర, ప్రస్తుత సంవత్సర సబ్సిడీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘాల పరిధిలో ఎరు వుల విక్రయాలను పరిశీలించారు. ఎరువుల విక్రయంలో సంఘాలు నియమ నిబంధ నలు పాటిస్తున్నారా లేదా పరిశీలించారు. ఈ సందర్భంగా సంఘాల కార్యదర్శులకు, మండల వ్యవసాయ అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట జిల్లా సహకార అధికారి సిహెచ్‌ఓ మనోజ్ కుమార్, ఆర్డిఓ జివాకర్’రెడ్డి, ఎమ్మార్వోలు సంబంధిత అధికారులున్నారు.