22-04-2025 12:23:51 AM
ట్యాబ్ ఎంట్రీలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలి
జిల్లా కో ఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్టార్ ఇందిరా
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఏప్రిల్ 21: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కో-ఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్టర్ ఇందిరా కోరారు.సోమవారం మండలంలోని జాజిరెడ్డిగూడెం,రామన్నగూడెం,వేల్పుచర్ల గ్రామాలలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాలు పడే అవకాశం ఉన్నందున త్వరగా కొనుగోళ్లు పూర్తి చేయాలని,కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించి ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీలు పూర్తి చేయాలని నిర్వాహకులకు సూచనలు చేశారు.అనంతరం రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.ఆయా కార్యక్రమాల్లో కేంద్రాల నిర్వాహకులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.