calender_icon.png 12 April, 2025 | 3:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు రోడ్లపై వరి ధాన్యం పోయకుండా పోలీసులకు సహకరించాలి

04-04-2025 09:08:15 PM

హుజురాబాద్ సిఐ తిరుమల్ గౌడ్

హుజురాబాద్,విజయక్రాంతి: హుజురాబాద్ మండలంలో వరి కోతలు మొదలయ్యాయని, రైతులెవ్వరు రోడ్లపై వరి ధాన్యాన్ని పోయకుండా పోలీసులకు సహకరించాలని హుజురాబాద్ సిఐ తిరుమల్ గౌడ్ రైతులను విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో శుక్రవారం   రైతులను ఉద్దేశించి  ఆయన మాట్లాడుతూ.. రైతులు రోడ్లపై దాన్యం పోయడం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. రాత్రిపూట వాహనాలు నడిపే వాహనదారులకు ధాన్యం కనిపించకపోవడంతో ప్రమాదాలకు గురవుతున్నారని,గతంలో రోడ్లపై ధాన్యం పోయడం వల్ల చాలా ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరిగిన సంఘటనలు మర్చిపోకూడదని అన్నారు. దయచేసి రైతులు ఎవరు రోడ్లపై ధాన్యాన్ని పోయావద్దని కోరారు.