25-03-2025 05:24:53 PM
జిల్లా వ్యవసాయ అధికారి కల్పన...
బెల్లంపల్లి (విజయక్రాంతి): రైతులు నకిలీ పత్తి విత్తనాలను కొనవద్దని జిల్లా వ్యవసాయ అధికారి కల్పన మంగళవారం బెల్లంపల్లి మండలంలోని కన్నాల రైతు వేదిక భవనంలో వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రైతులకు నకిలీ పత్తి విత్తనాలపై అవగాహన కార్యక్రమాన్ని ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి కల్పన మాట్లాడారు. రైతులు విడిగా అమ్మే విత్తనాలు ఎట్టి పరిస్థితుల్లో కొనవద్దన్నారు. లైసెన్సు కలిగిన దుకాణాలలో మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు. కొనుగోలు చేసిన విత్తనాలకు సంబంధించి రసీదులు భద్రపారుచుకోవాలని కోరారు. రైతులు గ్లైసీల్ పత్తి విత్తనాలను కొనుగోలు చేయొద్దని, విత్తన దళారులని నమ్మి మోసపోవద్దని తెలిపారు.
బెల్లంపల్లి రూరల్ సీఐ ఆఫ్జలుద్దీన్ మాట్లాడుతూ... రైతులు నకిలీ పత్తి విత్తనాలు అమ్మే వారి వివరాలు పోలీసులకు తెలపాలని కోరారు. రైతులు సహకరిస్తే నకిలీ విత్తన దందాను అరికడతామని చెప్పారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మినా, కలిగి ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏడిఏ రాజ నరేందర్ మాట్లాడుతూ... రైతులు గ్లైపోసిట్ వినియోగంతో వారి ఆరోగ్యంతో పాటు నేల ఆరోగ్యం పాడుచేస్తున్నారని, దీనిని జిల్లాలో నిషేధించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి వ్యవసాయ అధికారి సుద్దాల ప్రేమ్ కుమార్, తాండూర్ వ్యవసాయ అధికారి సుష్మ, ఉద్యాన అధికారి అర్చన, తాళ్ల గురిజాల ఎస్సై చుంచు రమేష్, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.