09-04-2025 02:26:13 AM
ఎమ్మెల్యే సామేలు
నాగారం, ఏప్రిల్ 8 : రైతులు దళారుల నమ్మి మోసపోవద్దని అని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు.మంగళవారం నాగారాం మండలంలోని గ్రామాల్లో పస్తాల మామిడిపల్లి పనిగిరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుని రాష్ట్ర ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని తెలిపారు.
ధాన్యంలో తరుగు పేరుతో కోతలు లేకుండా చివరి గింజవరకు ధాన్యం కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. అసత్య ప్రచారాలు నమ్మవద్దని రైతులను కోరారు. తాసిల్దార్ బ్రహ్మయ్య, ఎంపిడిఓ మారయ్య, ఏపిఎం శోభారాణి, తిరుమలగిరి మార్కెట్ చైర్మన్ ఎల్సోజు చామంతి తొడుసు లింగయ్య, సుంకరి జనార్ధన్ ఆకుల బుచ్చిబాబు పానుగట్టి నరసింహారెడ్డి సోమయ్య వేణు వెంకన్న శ్రీనివాస్ రమేష్ బాలకృష్ణ యాదగిరి ఎల్లయ్య మల్లయ్య అంజయ్య ఐకెపి నిర్వాహకులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.