జగదేవపూర్ (విజయక్రాంతి): జగదేవపూర్ మండలం అలీరాజ్ పేట గ్రామంలో విశ్వతేజ కాటన్ మిల్లులో సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా గజ్వేల్ ఏఎంసి చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గజ్వేల్ నియోజకవర్గంలో 6 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సీసీ కేంద్రాల్లో అమ్మి ప్రభుత్వం ఇచ్చిన గిట్టుబాటు ధర పొందాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మిల్లు నిర్వాహకులు రమణ రావు, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, గజ్వేల్ మార్కెట్ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, జగదేవపూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.