calender_icon.png 31 March, 2025 | 12:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దు

28-03-2025 03:03:55 PM

రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ,(విజయక్రాంతి): దళారులకు ధాన్యాన్ని అమ్మి రైతులు మోసపోవద్దని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాల పరిధిలోని మైలారం సొసైటీ పరిధిలోని తిమ్మాపూర్ బీర్కూరు మండల కేంద్రంలో వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి వరి ధాన్యం కోతలు అన్ని జిల్లాలతో పోలిస్తే బాన్సువాడ నియోజకవర్గంలో ముందస్తుగా ప్రారంభమైనట్లు తెలిపారు.

అందుకు అనుగుణంగా రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకొని మోసపోవద్దని మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభిస్తుందని తెలిపారు. రైతులకు ఎటువంటి రాష్ట్రం జరగకూడదు అని రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ నిబంధనలకు లోబడి సన్న రకం ధాన్యానికి రూ. 500 లు బోనస్ ప్రోత్సాహకంగా క్వింటాలుకు ఇవ్వడం జరుగుతుందన్నారు, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ 23 20 కామన్ గ్రేడ్ రకానికి రూ 2300 లకు కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు శుభ్రం చేసి పొల్లు లేకుండా తేమ  17 శాతం లోపు ఉండేలా కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని కోరారు. ఆయా కార్యక్రమాలలో రాష్ట్ర ఫుడ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల, ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులు, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు ..