calender_icon.png 6 May, 2025 | 9:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

09-04-2025 05:24:43 PM

తుంగతుర్తి: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా పాలనలో విద్యా, వైద్యంతో పాటు వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న అన్నారు. తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ ఆదేశానుసారం మండల పరిధిలోని బండ రామారం, మంచ తండా, అన్నారం, వెలుగుపల్లి, కొత్తగూడెం, గుడి తండా గ్రామాల్లో ఐకెపి, పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు.

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో వేల కోట్ల రైతుల రుణాలను మాఫీ చేయడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం రైతుబంధు పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాళ్లు గుట్టలకు కూడా కోట్ల రూపాయలను రైతుబంధు పేరా ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఘనత గత ప్రభుత్వానిదని, రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.