calender_icon.png 17 April, 2025 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల శ్రేయస్సు కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయం...

08-04-2025 02:39:01 PM

దళారులను ఆశ్రయించి రైతులు మోసపోవద్దు

కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని విక్రయించాలి

ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి

మునుగోడు,(విజయక్రాంతి): రైతుల శ్రేయస్సు కాంగ్రెస్ ప్రభుత్వం గేయం అని ఉమ్మడి నల్గొండ జిల్లా బీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం మునుగోడు మండలంలోని,మునుగోడు, కొరటికల్, గూడపూర్,పులిపలుపుల ఊకోండి, కచలాపురం గ్రామాలలో ఐకేపీ, పీఏసీఎస్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు రైతులు వరి ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన ఏ గ్రేడ్ రకానికి రూ.2320 మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. తాలు, మట్టి పెల్లలు లేకుండా వడ్లు ఆరబెట్టుకొని తీసుకువచ్చి కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సహకరించాలని అన్నారు. సన్న వడ్లు పండించే రైతులకు క్వింటాలకు అదనంగా 500 బోనస్ అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాల్వాయి చెన్నారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమనపల్లి సైదులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వేమిరెడ్డి జితేందర్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.