calender_icon.png 24 October, 2024 | 10:39 PM

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

24-10-2024 08:14:57 PM

దౌల్తాబాద్,(విజయక్రాంతి): రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దనే విక్రయించి మద్దతు ధర పొందాలని ఎంపీడీవో వెంకట లక్ష్మమ్మ, ఏపీఎం యాదగిరి లు అన్నారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ తో పాటు సూరంపల్లి, ముత్యంపేట, ముబారస్పూర్, హైమాద్ నగర్, మల్లేశం పల్లి, మహమ్మద్ షాపూర్, ఇందు ప్రియల్, గొడుగుపల్లి, ఉప్పరపల్లి, గువ్వలేగి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రభుత్వం ఏ గ్రేడ్ రకానికి రూ.2320, బి గ్రేడ్ రకానికి రూ.2300 మద్దతు ధర ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని ప్రతి రైతు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దనే విక్రయించాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్దకు తెచ్చే ధాన్యాన్ని 17% తేమ ఉండే విధంగా చూసుకొని తీసుకురావాలని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ జహీర్, సీసీలు బాల్ రాజ్, సునీత, నాగరాజు, లక్ష్మణ్ ,వైకుంఠం, కనకరాజు, మహేష్, ఏఈవోలు సంతోష్, బాపు రాజు, సునంద, శిరీష తోపాటు ఆయా పార్టీల నాయకులు, రైతులు పాల్గొన్నారు.