05-04-2025 05:46:47 PM
ప్రభుత్వం అండగా ఉంటుందని జుక్కల్ ఎమ్మెల్యే భరోసా..
బిచ్కుంద (విజయక్రాంతి): రైతులెవ్వరూ అధైర్యపడద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు రైతులకు భరోసా కల్పించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న వరి, జొన్న పంటలను ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావు శనివారం పరిశీలించారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం వాజీద్ నగర్ లో ఇటీవల అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అకాల వర్షాల కారణంగా చేతికి వచ్చిన పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ఇప్పటికే అధికారులు జరిగిన నష్టాన్ని అంచనా వేసి నివేదిక రూపొందించడం జరిగిందని తెలిపారు.
రైతులు ఎవరూ ఆందోళన చెందకూడదని అన్నారు, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం బండ రెంజల్లో సన్నం బియ్యం పంపిణీ పథకాన్ని ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత రావు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. లబ్ధిదారులకు స్వయంగా బియ్యం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమని పేర్కొన్నారు. అనంతరం బండ రేంజల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి కొబ్బరి కాయ కొట్టి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.