21-03-2025 12:31:48 AM
త్వరలో తపస్సుపల్లికి నీళ్లు
ఎఎంసి చైర్మన్ నల్లనగుల శ్వేతా వెంకన్న
చేర్యాల, మార్చి 20( విజయ క్రాంతి): త్వరలో తప్పస్పెల్లి రిజర్వాయర్ నుంచి నీటి విడుదల జరుగుతుందని, రైతులు అధైర్య పడుద్దని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్ల నాగుల శ్వేతా వెంకన్న అన్నారు. చేర్యాల పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నీటి విడుదల విషయం జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి తెలియజేయడంతో వెంటనే స్పందించిన ఆయన ఇరిగేషన్ అధికారులు మాట్లాడి నీటి విడుదలకు కృషి చేశారన్నారు. బొమ్మకూరు నుండి రెండు రోజులలో తపాస్ పల్లి రిజర్వాయర్ కు నీటిని విడుల చేస్తామని నీటిపారుదల శాఖ ఈ ఈ, ఏఈలు తెలిపారు అన్నారు. నల్ల నాగుల శ్వేతా వెంకన్న మాట్లాడుతూ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి,అధికారులతో మాట్లాడి నీటిని తపాస్ పల్లి రిజర్వాయర్ కు విడుదల చేయాలని సూచించారని,రెండు రోజులలో పంపింగ్ మొదలవుతుందని తెలియజేశారు. ప్రతిపక్షాల మాటలు విని రైతులు ఎవరు ఆధైర్య పడవద్దు అని అన్నారు.