21-04-2025 01:39:02 AM
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
జైపూర్ (చెన్నూర్), ఏప్రిల్ 20 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టంలో పొం దుపరిచిన అంశాలను రైతులు తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నా రు. ఆదివారం జైపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి నూతన ఆర్.ఓ. ఆర్. చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎంఎల్‌ఏ గడ్డం వివేక్ వెంకట స్వామితో కలిసి మాట్లాడారు. ప్రభు త్వ ఆదేశాల మేరకు ఒక మండలాన్ని ఎంపిక చేసి మండలంలోని అన్ని రకాల సమస్యలను తెలుసుకొని నిర్ణీత గడువులోగా పరిష్కరించడం జరుగుతుందని, సంబంధిత పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందించడం జరుగుతుందని తెలిపారు.
ఈ నెల 30వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండలాలలో సదస్సులు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుం దని, ఇందు కొరకు కార్యచరణ రూపొందించడం జరిగిందని తెలిపారు. ఎంపిక చేసిన మండలంలో జూన్ 2వ తేదీ వరకు సమస్యల పరిష్కరించి, మిగిలిన మండలాలలోని సమస్యల ను గుర్తించి ఆగస్టు 15వ తేదీ లోగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామాలలో నెలకొన్న సమస్యలపై దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, సర్వే ప్రక్రియలో సంబంధిత సర్వేయర్లు, ఇతర అధికారుల నియా మకంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
గ్రామస్థాయిలోని సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించి పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని, రైతులకు పట్టాభూమి, లావుని పట్టా, ఇతర రకాల భూములకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వ ఆదేశాలు, చట్ట ప్రకారం చర్య లు తీసుకోవడం జరుగుతుందని, టైటిల్, పొసెషన్ సంబంధిత సమస్య లు, కోర్టులో కొనసాగుతున్న కేసులను మినహాయించి మిగిలిన వాటిని పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, మంచి ర్యాల ఆర్డీవో శ్రీనివాస్ రావు, తహశిల్దార్ వనజా రెడ్డి, మండల పంచాయితీ అధికారి శ్రీపతి బాబు పాల్గొన్నారు.