calender_icon.png 9 January, 2025 | 7:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘శాస్త్రవేత్తల సూచనలు రైతులు పాటించాలి’

29-12-2024 02:46:34 AM

ఆదిలాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): పత్తి పంటకు డిసెంబర్ తరువాత గులాబీ రంగు పురుగు సోకడంతో రైతులకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉన్నందున పంటను పొడగించకుండా వ్యవసాయ శాస్త్రవేత్తాలు, వ్యవసాయాధికారుల సూచన లు తీసుకొని నీటి వసతి ఉన్న రైతులు వేరే అనుకూల పంటలు వేసు కోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజరి షా సూచించారు.

శనివారం జైనాథ్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో పత్తి పంటను కలెక్టర్ వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలిం చారు. కార్యక్రమంలో వ్యవసాయి శాస్త్రవేత్త రాజశేఖర్, కృషి విజ్ఞాన కేంద్రం సాంకేతిక వ్యవసాయాధికారి వెండి విశామిత్ర, మండల వ్యవసాయాధికారులు కుమారి పూజ, సాయితేజ్‌రెడ్డి పాల్గొన్నారు.