calender_icon.png 4 March, 2025 | 9:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హార్టికల్చర్ సాగుపై రైతులు దృష్టి సారించాలి

04-03-2025 06:51:59 PM

జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ శ్రవణ్ కుమార్..

మెదక్: రైతులు హర్టికల్చర్ సాగుపై దృష్టి సారించి ఆదాయం పెంపొందించేందుకుగాను కృషి చేయాలని జిల్లా హర్టికల్చర్ మేనేజర్ శ్రవణ్ కుమార్ సూచించారు. మంగళవారం రోజున మండల పరిధిలోని అల్లాదుర్గం, కాయిదాంపల్లి గ్రామాలలో ఉపాధి హామీ నిధులతో ఏర్పాటు చేసిన నర్సరీలు, హార్టికల్చర్ సాగు చేస్తున్న తోటలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రైతుల ఆదాయ వనరులను పెంపొందించేందుకు గాను ఉపాధి హామీ నిధుల ద్వారా జామ, మామిడి, నిమ్మ, కొబ్బరి, మునగ తదితర పండ్ల తోటల పెంపకం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి గల రైతులు మండలంలోని ఉపాధి హామీ కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చంద్రశేఖర్, ఎపిఓ సుధాకర్, టెక్నీకల్ అసిస్టెంట్ సాయి కుమార్, పంచాయతీ కార్యదర్శులు నవీన్, ప్రభాకర్ లు పాల్గొన్నారు.