calender_icon.png 13 February, 2025 | 7:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి

13-02-2025 12:00:00 AM

నేటి పారుదల శాఖ ఈఈ రాంప్రసాద్ 

చర్ల, ఫిబ్రవరి 12 ః భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలి పేరు ప్రాజె క్టు ఇన్‌ఫ్లో తగ్గడం వల్ల రైతులు ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని నీటి పారు దల శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ రాం ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలి పారు. గత సంవత్సరం భద్రాచలం శాసన సభ్యులు తెల్లం వెంకటరావు అధ్యక్షతన, కార్యనిర్వాహక ఇంజినీర్ ఇరిగేషన్ డివిజ న్ భద్రాచలం సమక్షంలో తాలిపేరు ప్రాజె క్టు రైతులతో రైతు వేదిక సత్యనారాయణ పురంలో సమావేశం నిర్వహించడం జరిగిందని.

ఈ సమావేశంలో తాళి పేరు ప్రాజె క్టు కింద 2024- 25 సంవత్సరమునకు గాను యాసంగి పంటకు, రొటేషన్ పద్ధతి లో ఈ సంవత్సరం జోన్-2 ఎడమ కాలువ పరిధిలోని ఆర్డి- 8 (కి.మీ11.034) నుండి ఆర్‌డి- 24 (కి.మీ 39.800) డిస్ట్రిబ్యూటరీ వరకు గల ఆయకట్టకు సాగునీటిని 31 మార్చి 2025 వరకు నీటి సరఫరా చేయు టకు నిర్ణయించామని అన్నారు.

ప్రస్తుతం ఈ రోజు ప్రాజెక్టు నీటినిలువ 73.72మీ., సామర్థ్యం 455 మిలియన్ ఘనపు అడుగు లు ఉన్నది, కానీ ఇన్ఫ్లో రోజురోజుకి పడిపో తున్న దృష్ట్యా యాసంగి పంటకు సంబం ధించి సాగునీటిని వారబంది పద్ధతిలో పై అధికారుల సూచనతో నిర్ణయించిన ప్రణా ళిక ప్రకారం నీటిని విడుదల చేయడం జరుగుతుందని, కావున జోన్ -2 ఆయకట్టు రైతులు గమనించి, ప్రణాళిక ప్రకారం పం పిణీ చేసే నీటిని, ఆరుతడి పంటలకు సద్వి నియోగం పరుచుకుంటూ, ఇరిగేషన్ శాఖ వారికి సహకరించాలని ఆయన కోరారు.