calender_icon.png 29 November, 2024 | 10:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు పండగ సంబరాలను విజయవంతం చేయాలి

29-11-2024 08:23:00 PM

కలెక్టర్ సిక్తా పట్నాయక్..

నారయణపేట (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం మహబుబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు పండుగ సంబరాల్లో రైతులు పాల్గోని విజయవంతం చేయాలని నారయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లోని వీసీ హల్లో రైతు పండగ సీఎం సభకు జిల్లా రైతులను తీసుకువెళ్ళేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లా అధికారులు, తాహశీల్దార్‌లు, ఎంపీడీవోలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 30న శనివారం మహబుబ్‌నగర్‌లో జరిగె రైతు పండగ సంబరాలకు ముఖ్య అథిధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి వస్తున్నారని, ఇట్టి సంబరాలకు నారయణపేట జిల్లా కేంద్రం నుండి రైతులు, మహిళ సంఘాల సభ్యులను  తీసుకువెళ్ళెందుకు 95 బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సభకు వచ్చె వారిని బస్సులలో తీసుకెళ్ళి తిరిగి వారి గమ్య స్థానాలకు చేర్చే భాధ్యత అధికారులదేనని అన్నారు.

జిల్లాలోని అన్ని మండలాల నుండి రైతులు, మహిళా సంఘం సభ్యులు మహబుబ్‌నగర్ సభ స్థలికి మధ్యాహ్నం రెండున్నర గంటలకు చేరుకునె విధంగా ప్రణాలిక చేసుకోవాలని అధికారులకు సూచించారు. సభకు వచ్చె ప్రతి ఒక్కరికి భోజన సౌకర్యం కల్పించాలని అన్నారు. ప్రతి బస్సుకు ఒక లైజర్ అధికారితో పాటు ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉంటారని అన్నారు. సభకు వెళ్ళే బస్సుకు ప్లేక్సీతో పాటు రైతులందరికి, మహిళా సంఘ సభ్యులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆమే అన్నారు. ప్రయాణ సమయంలో నీటి సౌకర్యంతో సభకు వచ్చిన వారికి ఇబ్బందులు కల్గకుండ చూసుకునె భాధ్యత సంబందిత అధికారులు చూసుకోవాలని ఆమె తెలిపారు. రాత్రి సమయంలో భోజన సౌకర్యం, మహిళ భద్రత కూడా చాల ముఖ్యమని ఆమె పేర్కోన్నారు. కార్యక్రమంలో రెవిన్యూ అధనపు కలెక్టర్ బెన్‌షాలం, డిఆర్‌డీవో మోగులప్ప, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధకర్, తాహశీల్దార్ లు పాల్గోన్నారు.