01-03-2025 12:19:59 AM
మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
నల్లగొండ ఫిబ్రవరి 28 (విజయక్రాంతి) : రైతులకు ఇబ్బంది లేకుండా మిల్లర్లంతా ధాన్యం కొనుగోలు చేయాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సూచించారు. మిర్యాలగూడ పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో శుక్రవారం మిల్లర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం కొనుగోలు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మిల్లర్లపై ఉందన్నారు. రైతులను ఇబ్బంది పడితే సహించేది లేదన్నారు. అంతకుముందు సుమన్ షోటోఖాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కరాటే శిక్షణ పొందిన విద్యార్థులకు సినీహీరో సుమన్తో కలిసి ఎమ్మెల్యే బెల్టులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఆడపిల్లలు ఆత్మరక్షణకు కరాటే నేర్చుకోవాలని ఆయన సూచించారు.