calender_icon.png 19 April, 2025 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలి

12-04-2025 12:05:58 AM

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

చివ్వేంల ఏప్రిల్ 11: రైతులు నాణ్యమైన ఎండ పెట్టిన ధాన్యంను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకవచ్చి  మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పేర్కొన్నారు. చివ్వేంల మండలం బీబీగూడెం లో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దొడ్డు రకం వడ్లు కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్  సందర్శించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం లో తాలు, పొల్లు లేకుండా తేమ శాతం 17 వచ్చిన దొడ్డు రకం వడ్లకి రూ. 2320 /-, సన్న రకం వడ్లకి అదనంగా బోనస్ రూ. 500 తో కలిపి రూ. 2820 /- పొందవచ్చు అని ఈ సందర్బంగా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపిడిఓ సంతోష్ కుమార్, మండల ప్రత్యేక అధికారి జగదీశ్వరరెడ్డి, సెంటర్ ఇంచార్జి సరిత,అధికారులు, గ్రామ ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.