calender_icon.png 19 April, 2025 | 4:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను ఆదుకోవాలి

24-03-2025 01:29:59 AM

ఎమ్మెల్యే హరీశ్‌బాబు 

కాగజ్ నగర్, మార్చి 23: అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే హరీష్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కాగజ్ నగర్ మండలంలోని విలేజ్ నెంబర్ 2, 12 , ట్రాక్టర్ షెడ్డు గ్రామాలలో పంటలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడగళ్ల వాన తో నష్టపోయిన రైతుకు ఎకరానికి 30000 రూపాయలు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈదురుగాలలో వడగల వానతో వరవల్, మామిడి మామిడి రైతు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన చెందారు.

నియోజకవర్గంలో వేద ఎకరాల పంట నష్టం జరిగిందని వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించి నష్టాన్ని అంచనా వేయాలని అన్నారు. ఫసల్ బీమా పథకం రాష్ట్రంలో అమలు చేయకపోవడంతో ఇలాంటి పంట నష్టం జరిగినప్పుడు రైతులు నష్టపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మనోహర్,శంకర్ ,అమిత్, సమీర్ ,దీపక్, గోవింద్ ,కమల్, తదితరులు పాల్గొన్నారు.