అఖిల భారత రైతు కూలీ సంఘం
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం అధ్యక్షులు ఎం.ప్రతాప్‌రెడ్డి ప్రభుత్వాన్ని మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరుతూ కలెక్టరేట్లు, తహసీల్దార్ కార్యాలయాల ముందు ధర్నాలు, ప్రదర్శనలు, రాస్తారోకోలు చెప్పట్టాలని పిలుపునిచ్చారు. వానలకు ప్రధానంగా ఖమ్మం, మహబూబాబాద్, కొత్తగూడెం, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో వరి, మొక్కజొన్న, పత్తి, మిరప, సోయ పంటలకు పెద్దఎత్తున నష్టం వాటిల్లిందన్నారు. బ్యాంకులు రైతుల రుణాలు రద్దు చేసి, కొత్త రుణాలు మంజూరు చేయాలని కోరారు.